Tuesday, 3 November 2026

సిఎం కెసిఆర్‌ బాగా పనిచేస్తున్నారు: అథవాలే

హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ పై కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలె ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్‌ చాలా బాగా పనిచేస్తున్నారని, అన్నివర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ కు తన తరఫున, కేంద్రం తరఫున అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుటి నుంచే తనకు పరిచయం ఉందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ కు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని రాందాస్‌ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌ వచ్చిన ఆయన విూడియాతో మాట్లాడారు. సీఎం కేసీతెలంగాణకు కేంద్రం నుంచి ఏ సాయం కావాలన్నా చేయడానికి సిద్దంగా ఉన్నామని రాందాస్‌ హావిూ ఇచ్చారు. తెలంగాణ కోసం అవసరమైతే ప్రధానమంత్రితో కూడా మాట్లాడతానన్నారు. తన శాఖ నుంచే కాకుండా ఇతర శాఖల్లో కూడా పెండింగ్‌ సమస్యలుంటే పరిష్కారానికి సహకరిస్తానని చెప్పారు. కేంద్రం నుంచి ఓబీసీ శాఖకు రావాల్సిన రూ.502 కోట్ల విడుదలకు కృషి చేస్తానన్నారు. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న తెలంగాణ అంటే తనకు కూడా చాలా ఇష్టమన్నారు కేంద్రమంత్రి. ఈ సమావేశంలో రాష్ట్రమంత్రి జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు.