Tuesday, 3 November 2026

చీర ఊయలే ఉరితాడైంది

చిన్నారి మృతితో విషాదం

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): చీరతో ఉయ్యాల ఊగుతూప్రమాదవశాత్తూ ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటనజూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తూర్పు గోదావరిజిల్లా రాఘవరం మండలంలోని సోమేశ్వరం గ్రామానికిచెందిన మదియా రాజేశ్వరి(29) ఆరేళ్లక్రితం భర్తవరప్రసాద్‌తో కలిసి బతుకుదెరువుకోసం నగరానికివచ్చింది. వికలాంగుడైన భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతోచనిపోవడంతో కూతురు శృతిలయ(6)తో కలిసిజూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 71లోని నవనిర్మాణనగర్‌లో ఓబంగ్లాలో పనిమనిషిగా చేస్తోంది. సర్వెంట్‌ రూమ్‌లోనివాసం ఉంటున్న

రాజేశ్వరి సాయంత్రం యజమాని ఇంట్లో పనికోసం వెళ్లింది. కాగా రూమ్‌లో ఉన్న దండానికిఉయ్యాల మాదిరిగా చీరను కట్టి దాంట్లో అడుకునే అలవాటు శృతిలయకు ఉంది. తల్లి పనికి వెళ్లే సమయంలో కూడా ఇదే విధంగా యధావిధిగా ఉయ్యాల ఊగుతోంది.యజమాని ఇంట్లో పని ముగించుకుని తిరిగి వచ్చినరాజేశ్వరి లోనికి వెళ్లి చూడగా ఉయ్యాల కోసం కట్టుకున్నచీరలో గొంతు ఇరుక్కుని ఉన్న కూతురు శృతిలయకనిపించింది. దాంతో తీవ్ర ఆందోళనకు గురైన రాజేశ్వరిపాపను కిందకు దింపి అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగాఅక్కడకు చేరుకున్న అంబులెన్స్‌ సిబ్బంది, పోలీసులుపరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తేలింది. ఈమేరకు మృతురాలి తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకుజూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు