సికింద్రాబాద్ (జనం సాక్షి ) : సికింద్రాబాద్ రైల్వే ఆర్ ఆర్ సి గ్రౌండ్ లో సైక్లింగ్ లో టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు.
డాక్టర్ మాక్స్ వెల్ ట్రేవర్ సైక్లింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మాక్స్ వెల్ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో సైక్లింగ్ క్రీడా ఉందని చాలామందికి తెలియదని అన్నారు. ఈ క్రీడల గురించి తెలుసుకోవాల్సిన అవసరం యువతకు ఉందని డాక్టర్ మాక్స్ వెల్ ట్రేవర్ సైక్లింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాక్స్ వెల్ పేర్కొన్నారు. సైక్లింగ్ పైన తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన లేకపోవడం వల్ల నేటి పిల్లలు సైక్లింగ్ క్రీడకు దూరమవుతున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల పిల్లల్లో నైపుణ్యత ఉన్నా సైక్లింగ్ స్పోర్ట్స్ తెలియక ఆర్థిక స్తోమత లేక దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని చిన్న వయసులోనే క్రీడల వైపు మళ్ళిస్తే చురుకుదనంతో పాటు క్రీడల్లో రాణిస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం నిర్వహించే పోటీల్లో భాగంగా నైపుణ్యతను గుర్తించాడనికి సికింద్రాబాద్ రైల్వే ఆర్ ఆర్ సి గ్రౌండ్ లో నేషనల్ సైక్లింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలలో
6 నుండి 15 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు ఈ టాలెంట్ పోటీల్లో పాల్గొన్నారు . ప్రతిభవంతులైన వారికి మ్యాక్స్ వెల్ ట్రేవర్ సైక్లింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వగా 40 మందికి పైగా స్టేట్, నేషనల్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో నిలిచారని తెలిపారు.
ఈ పోటీలకు అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, రాష్ట్రంలోని వివిధ విభాగాల అధికారులు హాజరై ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పిల్లలకు బహుమతులు అందజేస్తారు.
చిన్న వయసులోనే క్రీడల వైపు మళ్ళించాలి తల్లిదండ్రులు సూచించారు .




