ఎల్బీ నగర్ (జనం సాక్షి ) బీజేపీ సీనియర్ నాయకులు, గత 35సంవత్సరాలనుండి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే సిద్దాల ఐలయ్య పుట్టినరోజు సందర్బంగా నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి, సన్మానం చేసారు . నాగోల్ డివిజన్ కార్పొరేటర్ అరుణా సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఐలయ్యకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి రానున్న రోజుల్లో పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బద్దం బాలకృష్ణ గౌడ్, నాయకులు దేవిడి నరేందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, డప్పు రాజు, వస్పరి మల్లేష్, లక్ష్మి జగదీశ్వరి, రాజ్యలక్ష్మి, గిరి గోరటి, పద్మారెడ్డి, గౌరి, దశరథ్ సాగర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సిద్దాల ఐలయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన :కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్




