సిపిఐ కేసముద్రం మండల కార్యదర్శిగా చొప్పరి శేఖర్ ఎన్నిక
ఈ సముద్రం ఆగస్టు 18 జనం సాక్షి /మంగళవారం నాడు మండల కేంద్రంలో జరిగిన సిపిఐ 18వ మండల మహాసభ లో ఏకగ్రీవంగా మండల కార్యదర్శిగా చొప్పరి శేఖర్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ…మండల కేంద్రంలోని బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి దోహద పడతానని, అండ దండలుగా ఉంటానని అన్నారు.ఈ ఎన్నికకు సహకరించిన సిపిఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బి. అజయ్ కి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.