Thursday, 5 November 2026

సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

గరిడేపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి):  అక్టోబర్ 14-18 వరకు విజయవాడ లో జరిగే సిపిఐ జాతీయ మహాసభల విజయవంతానికి సిపిఐ కార్యకర్తలు అందరు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం మండల కేంద్రంలో సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్ర లో సిపిఐ కి ప్రత్యేక స్థానం వున్నదని దేశ స్వాతంత్ర్యము కోసం సిపిఐ ముందుండి పోరాడిందని స్వాతంత్ర్యము కావాలని బ్రిటిష్ వాళ్ళను మొదటిగా డిమాండ్ చేసిన పార్టీ సిపిఐ అని స్వాతంత్ర్యనంతరం  పాలకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల పై అలుపెరుగనిపోరాటం ప్రజల పక్షన  చేస్తున్న పార్టీ సిపిఐ మాత్రమేనని ఆయన అన్నారు. ఓట్లకోసం సీట్లకోసం కాకుండా నిరంతరం ప్రజల మధ్యన ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం వారి హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ పోరాటాలు చేస్తూనే ఉంటుందని తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది వీరులను త్యాగం చేసి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచటమే కాక వేలాది గ్రామాలను దేశముఖ్ దొరల నిజాం నవాబు చెరనుండి విముక్తి చేసి గ్రామ కమిటీ లు వేసిన చరిత్ర సిపిఐ కి వున్నదని ఆయన అన్నారు.అంతటి మహాత్తర  చరిత్ర వున్న సిపిఐ జాతీయ మహాసభలు  ప్రక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మనకు దగ్గరగా వున్న విజయవాడ పట్టణంలో జరగటం మన అదృష్టం అని ఆ మహాసభల లో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారని వారితో పాటు మనము కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు త్రిపురం సుధాకర్ రెడ్డి, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య, యడ్ల అంజిరెడ్డి, ప్రతాని సైదులు, గోధుమల ఈశ్వరాచారి, బొందయ్య, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area