సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.
బూర్గంపహాడ్ అక్టోబర్ 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గం పహాడ్ మండలం భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభ లు 2022 అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని శనివారం సారపాక పట్టణంలో అన్ని షాపులు తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమ కాలము నుండి సిపిఐ పలు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిందని, బ్రిటిష్ వలస పాలనకు జమీందారీ జాగీదారి విధానాలకు వ్యతిరేకంగా సంస్థానాల రద్దు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని పోరు సల్పిందని, భారత కమ్యూనిస్టు పార్టీ నిషేధాలను నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా సామ్రాజ్యవాదం ఉక్కుపాదం పై కన్ను ఎర్ర చేసిందని అన్నారు. 24వ జాతీయ మహాసభలకు వేలాదిగా తరలి భారీ ప్రజా ప్రదర్శన అనంతరం బహిరంగ సభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పేరాల శ్రీనివాసరావు, ఏ ఐ టి యు సి అధ్యక్షులు ఎండి సాజిద్, ఏఐవైఎఫ్ నాయకులు జుహూర్, సుమంత్, ఎస్కే జలీల్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.