Tuesday, 3 November 2026

సిపిఐ నేత డి చంద్రయ్యను పరామర్శించిన రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు

వనపర్తి సెప్టెంబర్ 30 (జనం సాక్షి)కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిపిఐ మాజి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డి.చంద్రయ్య ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఉమ్మడి జిల్లా జిల్లా కార్యదర్శి సురేష్ తదితరులు గురువారం సాయంత్రం వనపర్తి లోని ఆయన స్వగృహంలో కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునీ ధైర్యం చెప్పారు.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.