Wednesday, 4 November 2026

సిపియస్ విధానాన్నీ నూతన విద్యా విధానం-2020 ని రద్దు చేయాలి

సిపియస్ విధానాన్నీ నూతన విద్యా విధానం-2020 ని రద్దు చేయాలి

*టియస్ యుటియఫ్ ఆధ్వర్యంలో జీపు జాతా

పెనుబల్లి, డిసెంబర్ 5(జనం సాక్షి)
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపుమేరకు టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో సిపిఎస్ విధానం రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, నూతన విద్యా విధానం 2020 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జీబు యాత్ర సోమవారం పెనుబల్లి మండలంలోని జెడ్.పి.ఎస్.ఎస్ లంకపల్లి,జెడ్పి.ఎస్.ఎస్ వి ఎం బంజర, మోడల్ స్కూల్ టేకులపల్లి లొ జరిగింది. ఈ సందర్భంగా టియస్ యుటియఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యతనుండి ప్రభుత్వాలు తప్పుకోవడానికి సిపిఎస్ అనే పథకాన్ని తీసుకొచ్చాయని, ఈ నూతన పెన్షన్ పాలసీ వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనీస పెన్షన్ కూడా రాని దుస్థితి వచ్చిందని వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం 2020 ని రద్దు చేయాలని , రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే లౌకిక, ప్రజాస్వామ్య ,శాస్త్రీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహా రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శులు జి.యస్.ఆర్.రమేష్, వి.వి.రామారావు,పూర్వ జిల్లా కార్యదర్శి ఎం. నరసింహా రావు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి వీర స్వామి, ఎన్.హెచ్. ప్రసాద్, ఆడిటర్ బి కృష్ణారావు కార్యదర్శులు జి. హనుమంతు, కే నాగరాజు, జి రవికుమార్ టి వందనం, పి వెంకటేశ్వర రావు, వి సొమ్లనాయక్, ఏ సైదారావు,సి హెచ్ శ్రీలత, కే నరేంద్ర,ఎం. ఝాన్సి పావని,ఎం సౌజన్య, బి వెంకట్రావు,పి ప్రియాసుధ,ఎం. నూతన కుమారి, ఎస్ రఘు నందన్ రెడ్డి, సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు అంతా పాల్గొన్నారు.