Friday, 6 November 2026

సిమెంట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

నల్లగొండ : నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని మైహోం సిమెంట్స్ కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీకి చెందిన ఫైరింజన్‌తో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు రూ.3 కోట్ల మేర నష్టం సంభవించిందని ఫ్యాక్టరీ అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *