గ్లోబల్ యంగ్ లీడర్ స్మృతి ఇరానీ

gsrklrebవరల్డ్ ఎకనమిక్ ఫోరం- 2015 యువ అంతర్జాతీయ లీడర్ గా భారత మానవ వనరుల మంత్రి స్మృతి ఇరాని ఎంపికయ్యారు. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో వర్కర్ స్థాయి నుంచి దేశంలో టాప్ పొలిటీషియన్ గా స్మృతి ఎదిగారని ఈ సందర్భంగా డబ్ల్యుఈఫ్ ప్రశంసించింది. గతంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, ఆలిబాబా చీఫ్ జాక్మా, యాహూ సిఇఒ మారిస్సా మేయర్, గూగుల్ చీఫ్ లారీ పేజ్, ఇటలీ ప్రధాని మాట్టె రెంజి ఈ అవార్డును అందుకున్నారు. 2015 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 187 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.