Wednesday, 4 November 2026

సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

 అల్వాల్ (జనంసాక్షి) జూలై 28

డివిజన్ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ హరే కృష్ణ నగర్ మరియు ఏకలవ్య నగర్ కాలనీలలో 34 లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్
గురువారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించటమేతమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రతి కాలనీలో అభివృద్ధి పరచి డివిజన్ ను అగ్రగామిగా నిలబెట్టే విధంగా తమ వంతు కృషి చేస్తానని అని అన్నారు. అదేవిధంగా డివిజన్లో జరుగుతున్న సిసి రోడ్ పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు డిఈ మహేష్, ఏఈ రవళి, రమేష్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్వాతి, స్థానిక టిఆర్ఎస్ డివిజన్అధ్యక్షులుబొబ్బిలి సురేందర్ రెడ్డి, కాలనీవాసులు ఉదయ్, ప్రకాష్, రమాకాంత్, ఆనంద్ కుమార్, కృష్ణ యాదవ్, బుచ్చిరెడ్డి, జయప్రకాష్, రామ్ చందర్ రెడ్డి, ప్రసాద్, కరుణాకర్ రెడ్డి, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు బి నాగేశ్వరరావు, శ్రావణ్, నర్ల సురేష్, రాజయ్య, కొండల్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, రాజు యాదవ్, శోభన్, సరిత, తదితరులు పాల్గొన్నారు.