అల్వాల్ (జనంసాక్షి) జూలై 23
అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ దినకర్ నగర్ కాలనీలో 16 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఈ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు, స్థానిక నాయకులు సూర్య కిరణ్, కవిత, అశ్విని, అరవింద్, జగన్, తదితరులు పాల్గొన్నారు.




