జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఒకటో వార్డులో జడ్పీ చైర్మన్ పుట్ట మధు సహకారంతో మంజూరైన కుమ్మరి స్వామి ఇంటి నుండి వరకు 10 లక్షల రూపాయలు నిధులతో గురువారం సిసి రోడ్డు పనులకు గ్రామ సర్పంచ్ దాసరి శంకరయ్య కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లెపల్లి సుకన్య రవీందర్ , ఉపసర్పంచ్ సాగర్ రావు, వార్డు సభ్యులు మేకల ప్రశాంత్, పుష్పలత సంతోష్, ఎండి అజిత్ ఎండి సోఫియా హైమద్, చిలుకూరు గీత, సౌందర్య రాజు, మాజీ ఎంపిటిసి ఏలువాక ఓదెలు, నాయకులు కొండ శ్రీనివాస్, ఎండి ఇబ్రహీం దోనేటి తిరుపతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్




