సిసి రోడ్డు, సైడ్ డ్రైన్లు ప్రారంభం
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి అమరవాది గ్రామంలో ఐదు లక్షల యాభై వేల జనరల్ నిధులతో సిసి రోడ్డు, సీసీ డ్రైన్స్ పనులు మునిసిపల్ చైర్ పర్సన్ జంగం కల స్థానిక కౌన్సిలర్ జిలకర మహేష్ తో సోమవారం సంయుక్తంగా ప్రారంభించారు.
అనంతరం మునిసిపల్ చైర్మన్ మాట్లాడుతూ క్యాతన్ పల్లి మున్సిపాలిటీని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఐదవ వార్డు అమరవాది, శేషుపల్లిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, ఇంకా పలు అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయని అన్నారు.
ఈ వార్డును పట్టణ స్థాయిలో అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ అర్రం విద్యాసాగర్ రెడ్డి, కమీషనర్ వెంకటనారాయణ, ఏఈ అచ్యుత్,
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టవేణి లింగయ్య, ఈశ్వరయ్య, రాజయ్య, యాదగిరి, పోశం, రవీందర్, శంకర్ ,రమణ,యూత్ నాయకులు వెంకటస్వామి, కిరణ్ , శేఖర్, శ్రీనివాస్, వార్డు నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.