సి.యం.అర్ డెలివరీ వేగవంతం చేయాలి

:జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ*.
  నల్గొండ బ్యూరో. జనం సాక్షి ,ఆగస్ట్ 8. కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ(సి.యం.అర్) ప్రక్రియ వేగవంతం చేసి నిర్దేశిత గడువు ఆగస్ట్ 31 లోగా పెండింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.సోమ వారం జిల్లా కలెక్టర్ నల్గొండ ఎఫ్.సి. ఐ గోదాం ను సందర్శించి మిల్లర్ ల నుండి ఎఫ్. సి. ఐ.కి సి.యం.అర్ డెలివరీ   తీరు పరిశీలించారు.మిల్లర్ లు ఎఫ్.సి. ఐ కి సి.యం.అర్ డెలివరీ,ఎఫ్.సి. ఐ.స్వీకరణ వేగ వంతం చేసి గడువు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ తో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,సహాయ పౌర సరఫరాల అదికారి నిత్యానంధం తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు