సీఎంఆర్ఎఫ్ నిరు పేదలకు వరం..
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 21 : సీఎం రిలీఫ్ ఫండ్ నిరు పేదలకు వరమని కేసీఆర్ దళం చేర్యాల మండల అధ్యక్షుడు షేక్ అఖిల్ అన్నారు. మండలంలోని కాశ గుడిసెలు గ్రామానికి చెందిన షేక్ నూర్జబీ రోజు కూలీ పనులకు వెళ్తూ కుటుంబ జీవనం సాగిస్తున్న తరుణంలో ఇటీవల అనారోగ్యానికి గురైన నూర్జ బీ మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న షేక్ అఖిల్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించారు. మంజూరైన చెక్కును శుక్రవారం లబ్ధిదారులైన షేక్ నూర్జబీ కి అఖిల్ అందజేశారు. సీఎంఆర్ ద్వారా సీఎం కేసీఆర్ నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి షేక్ అఖిల్ కు నూర్జబీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ కమల్, వార్డు మెంబర్ అక్బర్, నాయకులు సుభాని, అప్జల్, చాన్, ఆలీ, మైబు తదితరులు పాల్గొన్నారు.