సీఎం కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేకర్ రావు.

నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.ముఖ్యమంత్రి వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు అన్నారు.స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు నేరేడుచర్ల మండలంలోని వీఆర్ఏల నిరవధిక దీక్షను ఆయన శుక్రవారం నాడు సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని 55 సంవత్సరాలు దాటిన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని ఆయన అన్నారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమోషన్ ఇవ్వాలని,అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు ఉద్యమించి కేసీఆర్ మెడలు వంచి వారి న్యాయమైన కోరికలను సాధించుకునే వరకు  ఉద్యమించాలని అన్నారు.సంఘీభావం తెలిపిన వారిలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్ పట్టణ కమిటీ సభ్యులు నీలా రామ్మూర్తి వీఆర్ఏలు సైదా,శోభ, పిచ్చమ్మ, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు