Thursday, 5 November 2026

సీఎం కేసీఆర్‌ 68వ పుట్టినరోజుమంత్రి హరీశ్‌ రావు శుభాకాంక్షలు

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ 68వ పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు (Harish rao) శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల కేసీఆర్‌ వల్లే నెరవేరిందని, భావి తరాల బంగారు తెలంగాణ ఆయనవల్లే సాధ్యమవుతుందని అన్నారు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు అని చెప్పారు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నదిని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది.

మీరు కారణజన్ములు, మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది.
ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.’ అని మంత్రి హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు.