హైదరాబాద్: సింగపూర్ ప్రతినిధులు ఏపీ రాజధాని ప్రణాళికను చంద్రబాబుకు అందజేశారు. ఈ ప్రణాళికను పరిశీలించిన చంద్రబాబు కొన్ని మార్పులు చేర్పులు చేసి, 8 వారాల్లోగా పూర్తి చేయాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో రెండు రింగ్ రోడ్లు నిర్మించి, కోర్ క్యాపిటల్‌కు అనుసంధానం చేయాలని చంద్రబాబు కోరారు. రేడియల్ రోడ్లు నిర్మించాలని కోరారు. రాజధాని ప్రణాళిక, ల్యాండ్‌పూలింగ్, కృష్ణానదిపై వంతెన నిర్మాణం, ల్యాండ్ పూలింగ్‌పై ఏపీ అధికారులు సింగపూర్ బృందానికి ప్రజంటేషన్ ఇచ్చారు




