హైదరాబాద్: తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఇందిరాపార్కు వద్ద సమరదీక్షలో నారాయణ పాల్గోని మాట్లాడారు. అఖిలపక్షానికి కాంగ్రెస్ అన్ని పార్టీలను పిలిచి అవమానించిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిన్న తెలంగాణపై చర్చల ప్రక్రియ అంటూ ఆజాద్, షిండే చేసిన ప్రకటలను సమర్థించిన మంత్రి జానారెడ్డిపై నారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతోనే జానా అలా మాట్లాడుతున్నారని. ఆరోపించారు.




