Tuesday, 3 November 2026

సీఎం ఫ్యాక్షన్‌ లీడర్‌లా వ్యవహరిస్తున్నారు: కోదండరాం

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్షన్‌ లీడర్‌లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐకాస  ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ కేడర్‌ సంఘం సర్వసభ్య సమావేశంలో కోదండరాం, ఎమ్మెల్యే  కేటాఆర్‌, తెరాస మాజీ ఎంపీ వినోద్‌ హాజరయ్యారు. కోర్టు ధిక్కరణ చేస్తూ పోలవరం ప్రాజెక్టు కట్టితీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని కోదండరాం డిమాండ్‌ వ్యక్తం చేశారు. రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభంలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి త్వరలో ఇందిరమ్మ విసనకర్రల పథకం, సోనియాగాంధీ ఇన్వర్టర్ల రాయితీ పథకం ప్రారంభిస్తారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ జరిగిన రోజు ప్రత్యేక తెలంగాణ పోరు ప్రారంభమైందని తెరాస సీనియర్‌ నేత వినోద్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *