సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే
టేకులపల్లి, సెప్టెంబర్ 9 (జనం సాక్షి): ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరి సింగ్ నాయక్ చేతులు మీదుగా పంపిణీ చేశారు.
ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామపంచాయతీకి చెందిన తేజావత్ సేర్వీ w/o బిచ్చ ఇటీవల అనారోగ్యంతో సర్జరీ చేయడంతో స్థానిక సర్పంచ్ మాలోత్ సురేందర్ నాయక్ ఆ కుటుంబానికి అండగా ఉండి వైద్య ఖర్చులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 28 వేల రూపాయలు మంజూరు చేయించారు.ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, సర్పంచ్ సురేందర్ చేతుల మీదుగా చెక్కును ఆమెకు అందజేశారు.