సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (9): గోపాల్ పేట్ మండల కేంద్రానికి సిద్ధార్థకు 60000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. బాధితుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని మండల టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కర్రోళ్ల స్వప్న భాస్కర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందించి బాధితునికి సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వడ్డేమాన్ రవి ప్రధాన కార్యదర్శి మహేష్, నాగరాజు, అంజి, తదితరులు పాల్గొన్నారు




