సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత…

చిలప్ చేడ్/8సెప్టెంబర్/జనంసాక్షి :- మండల పరిధిలోని గంగారం గ్రామనికి చెందిన దాసరి మొగులయ్యకు సీఎం సహాయనిది ద్వారా రూ.60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామంలో టిఆర్ ఎస్ నాయకురాలు విజయమ్మ, ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా నిరుపేదల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమత బాబు, టిఆర్ ఏస్ నాయకులు ఇర్ఫాన్, వార్డు మెంబర్లు నీరుడి మైపాల్, మన్నే విట్ఠల్, కొండ రమేష్, రాజు, బాలయ్య, మాణయ్య తదితరులు పాల్గొన్నారు.