సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ,
రాయికోడు, జనం సాక్షి జులై 21,రాయికోడు మండలంలోని జంబిగి కె గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్ కు గ్రామ సర్పంచ్ టి పార్వతి టిఆర్ఎస్ నాయకులు తిరుమల శ్రీకాంత్, ఎం శివకుమార్ ల చేతుల మీదుగా 60 వేయిల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ పార్వతి నాయకులు టి శ్రీకాంత్ లు మాట్లాడుతూ జంబిగి కె గ్రామానికి సంబంధించి వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న లబ్ధిదారులకు ఇంతవరకు ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ల సహకారంతో రూపాయలు 20 లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు చెప్పారు ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు, జంబిగి గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పి ఆనందం పటేల్ దత్తాత్రేయ పటేల్ పట్లోళ్ల ప్రసాద్ వెంకన్న నర్సింలు తదితరులు పాల్గొన్నారు