*సీఎం సహాయనిధి చెక్కు అందజేత*
మునగాల, ఆగష్టు 8(జనంసాక్షి): కలకోవ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శ్రావణం నరసింహారావుకు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అనంతు శ్రీనివాస్ గౌడ్ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు గన్నా నరసింహారావు మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న పేదలను సీఎం సహాయనిధి నుండి ఆదుకొని ఆర్థికంగా సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కెసిఆర్ కు మరియు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ మెంబర్ కొంపల్లి వీరబాబు, ఉపసర్పంచ్ బెల్లంకొండ చిన్న వెంకన్న, రైతు సమన్వయ సంఘం అధ్యక్షులు అమరగాని వీరభద్ర గౌడ్, వార్డ్ నెంబర్ వీరబాబు, కోఆప్షన్ సభ్యులు మండవ చిన సైదులు, పనస వీరయ్య, మునగలేటి తిరపయ్య తదితరులు పాల్గొన్నారు.