సీఎం సహాయని చెక్కుల పంపిణీ
రుద్రంగి అక్టోబర్ 11 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలోనీ ఉమ్మడి మానాల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య సమస్యలతో చికిత్సలు పొందిన ఏడుగురు లభ్డిదారులకు సుమారుగా 3 లక్షల 47 వేల రూపాయల చెక్కులను మంగళవారం వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య వివిధ గ్రామాల సర్పంచ్ లతో కలిసి దెగవత్ తిరుపతి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందించాడం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.