Tuesday, 3 November 2026

సీఎం సహాయ నిధి పేదలకు వరం

హుజూర్ నగర్ సెప్టెంబర్ 9 (జనం సాక్షి): సీఎం సహాయనిధి పేదలకు వరమని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాలో బూరుగడ్డ మాచవరం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో బూరుగడ్డ మాచవరం గ్రామ సర్పంచ్ షేక్ సలీమరంజాన్, హుజూర్ నగర్ మండల ఎంపిపి గూడెపు శ్రీనివాస్, మండల తెరాస పార్టీ ముడెం గోపీ రెడ్డి ల చేతుల మీదుగా 7గురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగిందన్నారు. లబ్ధిదారులు చింత కమలమ్మ 60,000, యరగాని నాగమణి 30,000, షేక్ ఖాసీం సాబ్ 30,000, గుర్రం కృష్ణ కుమారి 48,000 కు, శ్రీ లక్ష్మి 14000, బంటు వెంకటేశ్వర్లు 12000, యరగాని రాంబాయి 24000 లు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం లబ్ధిదారులు హుజుర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.