సీఐటీయు మండల అధ్యక్ష కార్యదర్శులుగా మంద రాజు, అపరాదపు రాజు

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 18 , ( జనం సాక్షి ) :
చిల్పూర్ మండల కేంద్రంలో జరిగిన సిఐటియు మండల మహాసభలో సిఐటియు మండల కమిటీ ని ఎన్నుకున్నారు.చిల్పూర్ మండల అధ్యక్షుడిగా చిల్పూరు మండల కేంద్రానికి చెందిన మంద రాజు ను, సిఐటియు మండల ప్రధాన కార్యదర్శిగా, మండల కన్వీనర్ గా లింగంపల్లి గ్రామానికి చెంది న అపరాదపు రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి రాపర్తిరాజు అన్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సీఐటీయు మండల అధ్యక్ష కార్యదర్శు లు మంద రాజు, అపరాదపు రాజులు మాట్లాడు తూ కర్మికులసమస్యలపై సీఐటీయు ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు నిర్వహించి సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తామని అన్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన సిఐటియు జిల్లా ప్రధాన కా ర్యదర్శి రాపర్తిరాజుకు,ఎంపీటీసీ ఎన్నకూస కుమా ర్ కు,జిల్లా, మండల నాయకులకు,వివిద రంగాల కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.