కూకట్ పల్లి (జనంసాక్షి ):
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే లో భాగంగా డివిజన్ పరిధిలోని పంచమి కాలనీలో ఎంటమాలజి, ప్రభుత్వ వైద్య సిబ్బందితో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే ఈ సందర్భంగా వర్షపు నీరు నిల్వఉన్న గుంతలలో స్వయంగా దోమల నివారణ మందులు పిచికారి చేశారు
.కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో దోమల వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకె ప్రమాదముంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇల్లు మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా దోమలు వ్యాప్తి నివారణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉన్న కరపత్రాన్ని ఇంటింటికి పంచారు. జ్వరం లక్షణాలు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మెడిసిన్ కిట్లను అందించారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, గణేషన్, ఖాజా, ఎంటమాలజీ సూపర్వైజర్ డి నరసింహులు, ఎంటమాలజి సిబ్బంది మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




