సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ

వీపనగండ్ల జులై   (జనంసాక్షి)
వీపనగండ్ల మండల కేంద్రంతో పాటు బొల్లారం గ్రామంలో  గురువారం నాడు సీజన్ వ్యాధులపై అవగాహన ర్యాలీ చేయడం జరిగింది
ఈ సందర్భంగా డాక్టర్ హేమ వర్ధన్,వంశీకృష్ణ మాట్లాడుతూ గ్రామాలలో క్రమంగా వాటర్ ట్యాంక్ శానిటేషన్ క్లోరినేషన్ లీకేజీ నివారణ బ్లీచింగ్ పౌడర్ స్ప్రేయింగ్ ఆయిల్ బాల్స్ లాంటి నివారణ చర్యలు తీసుకోవాలని వారు అన్నారు డెంగ్యూ మరియు ఇతర వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాచి చల్లార్చిన నీటిని త్రాగడానికి ఉపయోగించాలని దోమకాటు నివారణకు చర్యలు తీసుకోవాలని, నిండు దుస్తులు ధరించాలని డోర్ విండో నెట్స్ ఫ్రైడే డ్రే డే పాటించాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ సెక్రెటరీ మహిళా సంఘాలు అంగన్వాడీ టీచర్లు జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Attachments area