సీజనల్ వ్యాధుల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
2వ వార్డు కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి.
దుబ్బాక 07, ఆగష్టు ( జనం సాక్షి )
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్న చెల్లాపూర్ లో జిల్లా మంత్రి తాన్నీరు హరీష్ రావు,మున్సీపల్ శాఖ మంత్రి కేటీఆర్,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం రోజు చెల్లాపూర్ లో 2వ వార్డు కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బందితో
సీజనల్ వ్యాధుల ప్రబలకుండా ఉండేందుకు బ్లీచింగ్ చేయడం, పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ 2వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ మాట్లాడుతూ చెల్లాపూర్ ప్రజలు గత కొని రోజులు నుంచి ఎడతెరిపి కురుస్తున్న వర్షాల కు ప్రజలు సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ప్రజలు రోజు గోరు వెచ్చని నీరు మాత్రమే తాగాలి అన్నారు.
ఎ పూట వంట ఆ పూట నే వండుకొని తినాలి అన్నారు.మన ఇంట్లో పాత పాత్రలలో నీరు నిల్వలు ఉండకుండా చూడాలి అన్నారు.మన ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు.తినుబండారాలకు దూరంగా ఉండాలి అన్నారు.ఈగలు వాలిన వాటిని అసలే తినకూడదు అన్నారు.ఎలాంటి ఇబండి ఉన్న కౌన్సిలర్ ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలి అన్నారు.