– నగరంలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో 2,482 వాహనాలు
– విడతల వారీగా వేలం వేయనున్న అధికారులు
హైదరాబాద్, మే12(జనం సాక్షి) : నగర రవాణాశాఖలో పేరుకుపోయిన సీజ్ వాహనాలను వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని రవాణాశాఖ పరిధిలో వేలాది వా హనాలు సీజై తుక్కుగా మారుతున్నాయి. దీంతో అధికారులు నగరంలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో వాహనాలన్నింటినీ వేలం వేయాలనే నిర్ణయానికి వచ్చారు. మొదటగా శనివారం నాగోల్ డ్రైవింగ్ ట్రాక్‌లోని వాహనాలను వేలం వేస్తున్నారు. ఇందులో ఆటోలు, ట్రాలీ లు, లారీలు, మినీవ్యాన్‌లు, కార్లు, ద్విచ క్ర వాహనాలు, ఇలా అన్ని రకాల వాహనాలున్నా యి. నాగోల్‌తోపాటు తిరుమలగిరి, మలక్‌పేట, బండ్లగూడ, మెహిదీపట్నం, ఖైరతాబాద్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో చాలా వాహనాలు సీజై పడున్నాయి. వీటిల్లో పన్ను చెల్లించని, కేసులు నమోదై సీజ్ కాబడిన వాహనా లు ఉన్నాయి. దీర్ఘకాలంగా రవాణాశాఖ కార్యాలయాల్లో పడిఉన్న వాహనాలను ఆర్‌ఆర్ యాక్ట్ క్రింద ప్రభుత్వానికి రావాల్సిన పన్ను వసూలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో కలిపి సుమా రు 2,482 వాహనాలున్నట్లు తేలింది. వేలంలో భాగంగా బిడ్డింగ్‌లో పాల్గొన డానికి ఒక్కొక్క వాహనానికి నాన్ రిఫండెబుల్ మొత్తం రూ.300, రిఫండబుల్ ఎమౌంట్ రూ. 2,000 మొత్తాన్ని ఆసక్తి గల బిడ్డర్లు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల జాబితా రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లిలిలి. బిసజీనిబ /ఔనీసబి.బి|్గ/జీనిణజీనిజీ.ణనీల.తినిలో ఉందని, హైదరాబాద్ జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. స్కాప్ర్ వాహనాలు కూడా వేలం వేస్తామన్నారు.




