Tuesday, 3 November 2026

సీడ్స్‌ కంపెనీలు నిబంధనలు పాటించాలి

అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు: అకున్‌ సబర్వాల్‌

హైదరాబాద్‌,జూలై27(జ‌నం సాక్షి): సీడ్స్‌ కంపెనీలు అమ్మే విత్తనాల సంచులపై వాటి బరువు, ఎమ్మార్పీ ఖచ్చితంగా ఉండేటట్లు చూడాలని రాష్ట్ర తూనికలు-కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌ స్పష్టం చేశారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే అనేక సీడ్స్‌ కంపెనీలలో అకస్మిక తనిఖీలు నిర్వహించామని చెప్పారు. సీడ్స్‌ మెన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని ప్యాఫ్సీ భవన్‌ లో తూనికలు- కొలతలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా చెయ్యాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పానికి తమ వంతు సహకారం అందిస్తామని సీడ్స్‌ మెన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిందని కొనియాడారు. ఈ సందర్భంగా పలు సీడ్స్‌ కంపెనీలు విత్తనాల సంచులపై ముద్రించిన ఎమ్మార్సీ, బరువుకు సంబంధించిన వివరాలను అకున్‌ సబర్వాల్‌ పరిశీలించారు.

—————