Thursday, 5 November 2026

సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ

ప్రమాణ స్వీకారోత్సవం సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం వరంగల్ ఈస్ట్, మార్చి 20 (జనం సాక్షి)రంగశాయిపేటలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేశవస్థాన ఉత్సవ కమిటీ  ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఖిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కెడల జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. నూతనంగా నియమించబడిన దేవాలయ ఉత్సవ కమిటీ చేర్మెన్ వలపదాసు కృష్ణ ,డైరెక్టర్స్ ప్రభాకర్,అనిల్,కవిత ల కు  ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.  శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో  పిఏసిఎస్ చెర్మన్,మాజీ కార్పొరేటర్ కేడల పద్మ జనార్దన్,పౌండర్ ట్రస్ట్ చేర్మెన్ రామ నర్సింహశాస్ట్రీ, ఆలయ అర్చకులు శ్రీధర్ ఆచార్యులు డివిజన్ అధ్యక్షులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.