Tuesday, 3 November 2026

సీతారాముల కళ్యాణానికి గోటితో ఒలిచిన తలంబ్రాలు. – అందజేసిన శ్రీ వాసవి మహిళా మండలి.

బెల్లంపల్లి, మార్చ్ 30, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో గురువారం సీతారాముల కళ్యానోత్సవానికి శ్రీ వాసవి మహిళా మండలి సభ్యులు గోటితో ఒలిచిన తలంబ్రాలు అందజేశారు. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో గోటితో వలిచిన ఎనిమిది లక్షల పదకొండు వేల పదహారు తలంబ్రాలను సిద్ధం చేశారు. ఈ తలంబ్రాలను వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుంచి కోదండ రామాలయం వరకు మేళా తాళాలతో కోలాటాలతో ఊరేగింపుగా వెళ్లి శ్రీ సీతారాముల కళ్యాణనికి తలంబ్రాలు సమర్పించారు. ఈసందర్బంగా వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు బాల విజయలక్ష్మి మాట్లాడుతూ బెల్లంపల్లిలోని మొదటిసారిగా శ్రీ కోదండ రామాలయం లోని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి 8,11,016 గోటితో ఒలిచిన తలంబ్రాలను సమర్పించడం జరిగిందన్నారు. భద్రాచలంలోని శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి గోటితో వలసిన తలంబ్రాలను సమర్పించడం చూసిన మేము కూడా బెల్లంపల్లి లోని కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గోటితో ఒలిచిన తలంబ్రాలను సమర్పించాలని ఒక దృఢ సంకల్పంతో నిర్ణయించడం జరిగిందన్నారు. ఈసంకల్పంలో అందరూ భాగస్వాములు చేయాలని ఉద్దేశంతో ఈకార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లిలోని దాదాపుగా 400 కుటుంబాల నుంచి మహిళలు పాల్గొనడం జరిగిందన్నారు. ఈకార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ సహకరించారన్నారు. ఈకార్యక్రమంలో వాసవి మహిళా మండలి ప్రధాన కార్యదర్శి చిలువేరు నికిత, పల్లెర్ల సింధుజ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాత భాస్కర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు పుల్లూరు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బాల సంతోష్, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షుడు నరేందుల వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి తణుకు కుమారస్వామి, రాచర్ల సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు