సీనియర్ జర్నలిస్టు ఆంజనేయులుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని కలెక్టర్ కు వినతిపత్రం

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 17 (జనం సాక్షి న్యూస్): అచ్చంపేట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కానుగుల ఆంజనేయులు కు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని జిల్లాలోని పలు జర్నలిస్టుల సంఘాల నేతల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. అక్రిడేషన్ కార్డుకు అన్ని రకాలుగా అర్హత కలిగి ఐదు సంవత్సరాలు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న ఇతనికి నియమ నిబంధనల ప్రకారమే అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. అదేవిధంగా అక్రిడేషన్ కార్డు జారీ విషయంలో ఎలాంటి వివక్షలు ,ఒత్తిళ్లు లేకుండా పారదర్శకంగా అర్హులైన జర్నలిస్టులకు అక్కడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్, రాములు, కాలూరి శ్రీను, చారకొండ వెంకటేష్, పందిరి శ్రీధర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు