Tuesday, 3 November 2026

సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

నవీపేట: మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు పోశెట్టి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డులు అందజేయాలన్నారు. పెంచిన పెట్రోలు ధరను నియంత్రించి, నిత్యవసర సరకుల ధరలు పెంచకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు హరనాంసింగ్‌, రాందాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *