*సీపీఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి బెజవాడ వెంకటేశ్వర్లు*
కోదాడ అక్టోబర్ 8(జనం సాక్షి)
ఆక్టోబర్ 14వ తారీకున విజయవాడలో జరిగే 24వ జాతీయమహా సభలను విజయ వంతం చేయాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో కోదాడ మండల సిపిఐ కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అధ్యక్షతన మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అక్టోబర్ 14నుండి18 వ తారీకు వరకు విజయవాడలో జరిగే సిపిఐ 24వ జాతీయ మహాసభలకు పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలన్నారు.1961,1975 లలో సిపిఐ జాతీయ మహాసభలను నిర్వహించిన ఘనత విజయవాడకు ఉన్నదని అన్నారు. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టాక ప్రజా,కార్మిక వ్యతిరేక,మతవాద,పాసిస్తూ,మతోన్ మాద శక్తులు పెరిగాయని విమర్శించినారు.సిపిఐ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించి పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటాల నిర్వహించిందని గుర్తు చేశారు.అక్టోబర్ 14 నుండి 18 వరకు నిర్వహించే జాతీయ మహాసభలలో పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు,రైతు సంఘం నాయకులు,బొల్లు ప్రసాద్,ఏఐటిసి ప్రాంతీయ నాయకులు పోతురాజు సత్యనారాయణ,పైడిమర్రి వెంకటనారాయణ,లత్తు,పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ గొట్టిముక్కల కోటి నారాయణ,సిపిఐ తమ్మర కార్యదర్శి మాతంగి ప్రసాద్, అల్వాలపూరం గ్రామ కార్యదర్శి జి నాగేశ్వరరావు,నాయకులు కొండ కోటేశ్వరరావు,కంబాల స్వామి,మాతంగి గాంధీ,కాటమరాజు,సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area