సీబీఐపై విమర్శిలు తగవు: ఆనం రామనారాయణరెడ్డి
హైదరాబాద్: అత్యున్నత దర్యాప్తుసంస్థ సీబీఐ పై వైకాపా గౌరవవ అధ్యక్షురాలు విజయమ్మ విమర్శలు చేయడాన్ని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఖండించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జగన్‌పై విచారణ జరుపుతున్న సీబీఐని విమర్శించడం తగదని హితవు పలికారు.