Thursday, 5 November 2026

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 20
అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ సత్యసాయి కాలనీ రోడ్ నెంబర్ 1 లోని 25 లక్షలతో సిసి రోడ్డు పనులను మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ పనులను పరిశీలించడం జరిగింది. గురువారం ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీ అభివృద్ధి చెందడానికి మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహాయ సహకారాల తీసుకొని మన డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మా వంతు కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా ప్రతి కాలనీలో సిసి రోడ్లు డ్రైనేజీలు వీధి స్తంభాలు మంచినీటి సౌకర్యం శానిటేషన్ వివిధ మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా పాటుపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు డిఈ కార్తీక్,
ఏఈ అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు ముత్యాలు, షేక్, షబ్బీర్, ప్రభాకర్, శ్యాంసుందర్, విజయ్ శేఖర్, జనార్ధన్, పెంటన్న, సాయికుమార్, రాజు, రామకృష్ణ, స్వప్న, ఉదయ, తదితరులు పాల్గొన్నారు.