సుంకేసులకు భారీగా వరద

రాజోలి ఆగస్టు 10(జనం సాక్షి)
రాజోలి…సుంకేసుల డ్యామ్ కి ఎగువ నుండి భారీగా వరద వస్తుంది. కురుస్తున్న వర్షాలు కర్ణాటక పరిధిలో ఉన్న ప్రాజెక్టు ల నుండి ఇన్ ఫ్లో భారీగా వచ్చి చేరటం తో సుంకేసుల అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. బుధవారం ఎగువనుండి1,58వేల861క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రాగా 27 గేట్లు తెరిచి 1,56 వేల 766 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రేశైలం కు విడుదల చేసి,కేసి కెనాల్ కు 2,095 వదిలినట్లు జేఈ రాజు తెలిపారు