సుంకేసులకు భారీగా వరద

రాజోలి 16 ఆగస్టు (జనం సాక్షి)
రాజోలి…సుంకేసుల డ్యామ్ కి ఎగువ నుండి భారీగా వరద వస్తుంది. కురుస్తున్న వర్షాలు కర్ణాటక పరిధిలో ఉన్న ప్రాజెక్టు ల నుండి ఇన్ ఫ్లో భారీగా వచ్చి చేరటం తో సుంకేసుల అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.మంగళవారం ఎగువనుండి80వేల014క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రాగా 19 గేట్లు తెరిచి 77 వేల 919క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రేశైలం కు వదిలి 2,095 క్యూసెక్కుల ను కె సి కెనాల్ కు విడుదల చేసినట్లు జేఈ రాజు తెలిపారు