సుందర్‌లాల్ బహుగుణకు అస్వస్థత!
డెహ్రాడూన్ : చిప్కో ఉద్యమ నిర్మాత, ప్రముఖ పర్యావరణవేత్త సుందర్‌లాల్ బహుగుణ(86) శ్వాస సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం డెహ్రాడూన్‌లోని జాలీగ్రాంట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, మరికొంత కాలం ఆయన ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుదని వైద్యులు తెలిపారు.