ఎల్బీ నగర్ (జనం సాక్షి ) గడిచిన 36 సంవత్సరాలుగా రాజకీయాలలో నైతిక విలువలను అనుసరిస్తూ, భవిష్యత్ తరాల కోసం ఆరాటపడే మనస్తత్వం ఉన్న శ్రీ సుధీర్ రెడ్డి గారు తన నిష్కలంక రాజకీయ జీవితంలో చేసిన అనేక ప్రజాసేవ, సంక్షేమ కార్యక్రమాలు, ప్లాస్టిక్ రహిత మరియు పర్యావరణహిత కార్యక్రమాలను గుర్తించి “ది అమెరికన్ యూనివర్సిటీ” వారు శ్రీ సుధీర్ రెడ్డి కి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. శుక్రవారం హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో యూనివర్సిటీ ఉప కులపతి మధు కృష్ణన్ ఈ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మధు కృష్ణన్ మాట్లాడుతూ సుధీర్ రెడ్డి తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చేసిన అనేక సేవ , సంక్షేమ కార్యక్రమాలు పర్యావరణ హితం కోసం తను చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రజలను ఆకర్షించాయని, అనాధల కోసం , కరోనా కష్టకాలంలో అందించిన నిరుపమానమైన సేవలకు, నిస్వార్ధమైన భవిష్యత్ తరాల కోసం ఆరాటపడే మనస్తత్వాన్ని కొనియాడారు. ప్రేమ, సోదర భావం, పరమత సహనం, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే గౌరవాలతోనే ప్రపంచం మనగడ సాగించగలుగుతుందని, ప్రేమతో ఈ ప్రపంచంలో జయించలేనిది ఏది లేదని పేర్కొన్నారు. “యుద్ధ భీతి” లేని ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యాల కోసం ప్రయత్నం చేయాలని యుద్ధాల వల్ల మానవాళి మనుగడ ప్రశ్నార్థకం కాకుండా భవిష్యత్ తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సూచించారు.అవార్డు గ్రహీత శ్రీ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తన సేవా కార్యక్రమాలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసిన యూనివర్సిటీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని,ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచ మానవాళి మనుగడ సాధించడానికి మరియు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టవలసిన కార్యక్రమాలను రూపొందించి ప్రజాక్షేత్రంలో తన ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.కరోన సమయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కరోనవ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది.దానిలో భాగంగా కరోనా సమయంలో ఏ ఒక్కరికి కరోనా సోకకుండా ఉండడానికి డ్వాక్రా గ్రూపు మరియు పలు పొదుపు సంఘాల మహిళలచే శానిటైజర్లు,మాస్కులు తయారు చేయించడం జరిగింది.అలాగే కరోనా సోకినవారు త్వరగా కోలుకోవడానికి మందులు మరియు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది.అలాగే రైతు బజార్లను కూడా ప్రక్కనే ఉన్న విశాలమైన స్థలంలోకి తరలించడం జరిగింది.అలాగే ఫ్రూట్ మార్కెట్ ను కోహెడకు తరలించడం జరిగింది.సూపర్ మార్కెట్ వారిని పిలిపించి ప్రజలకు నిత్యావసర వస్తువులు ఎలా సరఫరా చేయాలో వివరించడం జరిగింది.అలాగే రోడ్డు మీద నివసించే పేదవారికి తినడానికి భోజనం అందించడం జరిగింది.అలాగే స్లామ్స్ నందు నివసించే నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది.కరోన సమయంలో చాలా మంది రోగులకు రక్తం దొరకడం లేదని గ్రహించి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.వలస కార్మికులకు కూడా భోజనాలు ఎర్పాటు చేసి,వారిని తమ,తమ స్వస్థలాలకు పంపించడం జరిగింది.అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనం పెంచేవిధంగా అన్ని పార్కులో,కాలనీలు,ప్రభుత్వ కార్యాలయాల్లో,స్కూల్లో విధిగా మొక్కలు నాటించడం జరిగింది అని తెలిపారు.అలాగే రి ప్లాంటేషన్ లో భాగంగా ఎల్.బి.నగర్ డి మార్ట్ నుండి వీ.ఏం.వరకు రోడ్డుకు ఇరువైపులా పెద్ద,పెద్ద చెట్లు నాటించడం జరిగింది అని తెలిపారు.అలాగే నాగోల్ ఫతుల్లా గూడ నందు అంతర్జాతీయ ప్రమాణాలతో స్మశానవాటిక నిర్మించడం జరిగింది అని తెలిపారు.అట్టి స్మశానవాటికలో దాదాపు 70% పచ్చదనం ఉండే విధంగా నిర్మించడం జరిగింది అని తెలిపారు.అట్టి స్మశానవాటికలో కట్టే కాల్చకుండా కేవలం ఎలక్ట్రిక్ తో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అని తెలిపారు.అట్టి స్మశానవాటికను చూడడానికి విదేశాల నుండి రావడం జరుగుతుంది అని తెలిపారు.అట్టి స్మశానవాటికలో కేవలం పచ్చదనం మీద శ్రద్ధ చూపెట్టడం జరిగింది అని తెలిపారు.అలాగే కామినేని దగ్గర ఆక్సీజన్ పార్క్ కూడా నిర్మించడం జరుగుతుంది అని తెలిపారు.ఈ 36 సంవత్సరాల కాలంలో నియోజకవర్గ పరిధిలో కాకుండా ఇతర నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ప్రధాన పార్కుల్లో మొక్కలు నాటించడం జరిగింది అని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో యూనివర్సిటీ తెలంగాణ ప్రతినిధులు శ్రీ శ్రీనివాస్, శ్రీమతి రంగేశ్వరి మరియు సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీ రమాకాంత్ పాల్గొన్నారు.




