ఖైరతాబాద్ : జూలై 27 (జనం సాక్షి) అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు అత్యున్నత శ్రేణి సూపర్ చిల్లింగ్ డ్రాట్ డిస్పెన్సర్‌ను విడుదల చేసిందని అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేంద్ర త్యాగి తెలిపారు. ఈ ఆయన మాట్లాడుతూ డిస్సెన్సర్ అత్యుత్తమమైన చిల్డ్ బీర్‌ను వినియోగదారులకు ఎలాంటి ముందస్తు వృథా లేకుండా అందిస్తుందన్నారు. తద్వారా యజమానులకు గణనీయంగా ఖర్చునూ తగ్గిస్తుందన్నారు. ఈ డిస్పెన్సర్ రెండు విభిన్నమైన ఉష్ణోగ్రతలు ఒకటి చిల్డ్(5-6 డిగ్రీల సెంటిగ్రేడ్) మరొకటి సూపర్ చిల్డ్(2-3 డిగ్రీల సెంటిగ్రేడ్)లో పనిచేయడంతో పాటుగా రీఫిల్లింగ్ కోసం ఇండికేటర్‌తో వస్తుందన్నారు. తమ బ్లాక్‌బస్టర్ బీర్ కారణంగా సుప్రసిద్ధమైన అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్, అత్యంత రుచికరమైన బీర్స్ పోర్ట్‌ఫోలియోను సైతం కలిగి ఉందన్నారు. ఈ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో లభ్యమవుతుంది. ఇటీవలనే ఈ బ్రాండ్‌ను గోవా , పాండిశ్చేరి మార్కెట్‌లలో సైతం విడుదల చేసినట్లు తెలిపారు.




