Tuesday, 3 November 2026

సెంట్రల్‌ వర్సిటీలో డ్రగ్స్‌ కలకలం

డ్రగ్స్‌ వాడుతున్న ఐటి ఉద్యోగులు
మూడు కేసులలో 11మంది అరెస్ట్‌
వివరాలు వెల్లడిరచిన సిపి సివి ఆనంద్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి): హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో డ్రగ్స్‌ సరఫరా కేసు నమోదైనట్టు సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. మూడు కేసులలో 11 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. రూ.4.50 లక్షలు విలువచేసే డ్రగ్స్‌, లాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశామని సీవీ ఆనంద్‌ వెల్లడిరచారు. డార్క్‌నెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు జరిగాయని తెలిపారు. గోవా నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి డ్రగ్స్‌ విక్రయాలు నిర్వహించారన్నారు. డ్రగ్స్‌ కేసులో 11 మంది సాప్ట్‌వేర్‌ ఉద్యోగులున్నట్టు వెల్లడిరచారు. యూనివర్సిటీలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ వినియోగం జరుగుతోందన్నారు. సాప్ట్‌వేర్‌ ఉద్యోగుల నుంచి స్టూడెంట్స్‌కు డ్రగ్స్‌ విక్రయం జరుగుతోందని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. డ్రగ్స్‌ కేసుల విషయంలో విద్యార్ధులు ఎక్కువగా వున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. ఓయో రూమ్‌ల్లో ప్రైవేట్‌ పార్టీలు జరుగుతున్నట్టు గుర్తించాం.. రూల్స్‌ పాటించకపోతే చర్యలు తీసుకుంటాం.. సీసీ కెమేరాలు ఉండాలి.. 6 నెలల స్టోరేజీ ఉండాలి.. ఓయో రూమ్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ఐడీ కార్డు తప్పనిసరి గా తీసుకోవాలన్నారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీలలో జోరుగా మత్తు ముందు విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో గంజాయి విక్రయాలు జరుగు తున్నాయి. డార్క్‌ నైట్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నారు విద్యార్థులు. డార్క్‌ నెట్‌ పైన హైదరాబాద్‌ పోలీస్‌ నిఘా ఉంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులను అరెస్ట్‌ చేశామన్నారు. ఇద్దరు విద్యార్థినులను కూడా అరెస్టు చేశాం.. ప్రతిభ, అవినాష్‌ డిగ్రీ కాలేజ్‌, మల్లారెడ్డి కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల్ని అరెస్ట్‌ చేశామని సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. కొంతమంది సాప్ట్‌ వేర్‌
ఇంజనీర్‌ లను కూడా అరెస్టు చేశామన్నారు. సాప్ట్‌ వేర్‌ కంపెనీలో కీలక పోస్టులలో వున్న కొంతమందిని పట్టుకున్నాం. మూడుకేసులలో 11 మంది అరెస్ట్‌ చేశాం. 4.50 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్‌, లాప్‌ టాప్‌ మొబైల్‌ ఫోన్లు సీజ్‌ చేసాం. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ లో ఏడుగురు అరెస్ట్‌ కాగా, ఒకరు పరారీలో ఉన్నారు. నార్కోటిక్స్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ వింగ్‌ ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్‌ చేశాం అని సీపీ చెప్పారు. ఎండీఎంఏ అనే డ్రగ్‌ని ఒక నైజీరియన్‌ దగ్గిర కొంటున్నారని, ఓ నైజీరియన్‌ చాలా కాలం నుంచి ముంబాయి లో 2013 నుండి అనుమతి లేకుండా ఉంటున్నాడని ఆయన వెల్లడిరచారు. జ్వాల పాండే అనే వ్యక్తి హాష్‌ ఆయిల్‌ అనే డ్రగ్‌ ను సరఫరా చేస్తున్నారని, నిఖిల్‌ అనే వ్యక్తి ఈ హాష్‌ ఆయిల్‌ నీ ఇక్కడ కొనుగోలు చేస్తున్నాడని పేర్కొన్నారు. జ్వాల పాండే అదిలాబాద్‌ జిల్లా కి చెందిన రైతులు నుంచి నేరుగా గంజాయి ఒప్పందం చేసుకొని సరఫరా చేస్తున్నారని, సొన రాయి అనే రైతు మరొక రైతు నుంచీ కొనుగోలు చేస్తున్నారన్నారు. ఒక కేజీ 15 వేలకి కొని 50 వేల రూపాయలకి ఐటి ఉద్యోగులకి అమ్ముతున్నారని తెలిపారు. మంగళ్‌ హాట్‌ కి చెందిన ఓ వ్యక్తి జొమాటో డెలివరీ బాయ్‌ లానే ఇంటికీ వెళ్ళి గంజాయి డెలివరీ చేస్తాన్నాడని తెలిపారు. చాలా మంది సాప్ట్‌ వేర్‌ ఉద్యోగులే ఈ కేసులో ప్రమేయం ఉందని, యూనివర్సిటీ లో విచ్చలవిడి గా డ్రగ్స్‌ వినియోగం పెరిగిందని ఇప్పటి నుంచి డ్రగ్స్‌ వినియోగం చేస్తున్న వారిని వదిలి పెట్టే అవకాశం లేదని ఆయన హెచ్చరించారు.