సెంట్రల్ మెడికల్ స్టోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 25 (జనం సాక్షి);
గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ సమీపంలో రాఘవేంద్ర హాస్పిటల్ ఎదురుగా సెంట్రల్ మెడికల్ స్టోర్ ను ఆదివారము గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.
మెడికల్ స్టోర్ యజమాని ఎమ్మెల్యే కి, చైర్మన్ కి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, మహేష్, గద్వాల టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, తెరాస పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగులు యాదవ్, రిజ్వాన్, ఎస్ వి ఆర్ రాజు, ఇమ్రాన్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు