సెప్టెంబర్ 15న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 15 (జనం సాక్షి) :-
గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామంలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలకు నులి పురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ మింగించే కార్యక్రమం ఉన్నందున దీనిపై గురువారం గోవిందరావుపేట్ పి హెచ్ సి లో మండలంలోని సబ్ సెంటర్ల వైద్య సిబ్బంది కార్యక్రమం నిర్వహించారు.రేపటి ఆరోగ్యవంతమైన సమాజం కొరకు ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామ సర్పంచి ఈ సం సమ్మయ్య ఉప సర్పంచి ఎం పీ పీ పాల్గొన్నారు పైన పేర్కొనబడిన 1నుండి19 సంవత్సరముల వయస్సు గ్రూపు పిల్లలందరికీ ఒకేరోజు దేశమంతా నులిపురుగుల నివారణ టాబ్లెట్లు మింగించడం ద్వారా నలుపురుగులను నివారించవచ్చునని వీటివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లలకు సగం టాబ్లెట్ రెండు సంవత్సరాలు నిండిన వారికి పూర్తి టాబ్లెట్  తర్వాత మింగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సుకుమార్ డాక్టర్ సునీత గ్రామ సర్పంచ్ ఈ సం సమ్మయ్య ఉప సర్పంచ్ తెల్ల హరిప్రసాద్ పబ్లిక్ హెల్త్ నర్స్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.